Wed Oct 16 16:44:03 UTC 2024: ## నిజామాబాద్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు నిధులు సమస్య కాదు: ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) పనులకు కేంద్రం నుంచి నిధుల కొరత లేదని, అన్ని పనులకు ముందస్తుగా నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. అడవిమామిడిపల్లి వద్ద చేపట్టిన పనులకు రూ.23.6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా, ఇంత వరకు ఇవ్వలేదని, అయినప్పటికీ కాంట్రాక్టర్ పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు.
నవంబర్ 2 వర కు ఆర్మూర్, అడవి మామిడిపల్లి వద్ద అప్రోచ్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారని, వచ్చే ఏడాది జూన్ వరకు మాధవనగర్ ఆర్‌వోబీ పనులు పూర్తి చేస్తామన్నారు.
ఆర్‌వోబీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.