Sat Nov 02 00:18:56 UTC 2024: ## గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌: జిల్లాలో రూ.10 కోట్లతో మరమ్మతు పనులు ప్రారంభం

**కాకినాడ:** గుంతలతో నిండిపోయిన రోడ్లతో కష్టపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం కింద జిల్లాలో 145 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు రూ.10.29 కోట్లు వెచ్చించనున్నారు. ఈ పనులు శనివారం ప్రారంభం కానున్నాయి.

విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పనులు ఆరంభిస్తారు. జిల్లాలో 1,300 కి.మీ మేర ఆర్‌అండ్‌బీ రహదారులు ఉన్నాయని, వీటిలో 1,070 కి.మీ మరమ్మతులకు గురయ్యాయని ఎస్‌ఈ జి.కంఠు తెలిపారు.

ప్రస్తుతం 145 కి.మీ మేర రూ.10.29 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్లు పూర్తయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మరో 195 కి.మీ మేర మరమ్మతు పనులకు రూ.9.40కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఆమోదించారని.. త్వరలో నిధులు విడుదల చేస్తారని ఆయన చెప్పారు.

Read More