Wed Oct 16 07:40:00 UTC 2024: ## భూమా అఖిలప్రియ మామతో గొడవ: విజయ డైరీ చైర్మన్ కి వార్నింగ్

నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ విజయ డైరీ చైర్మన్ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి తో గొడవపడ్డారు. ఆమె తన మామగా ఉన్న విజయ డైరీ చైర్మన్ కు ఫోన్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు.

కర్నూలు జిల్లా విజయ డైరీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టడం ఈ గొడవకు కారణం అని తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో లేకపోవడం వల్లే.. ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారట.

నంద్యాలలోని డైరీ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె అక్కడ తన మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో ఆయన కుర్చీలో కూర్చున్నారు. అక్కడి నుంచే ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆమె ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎందుకు జగన్ ఫోటోలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఫోటోలు కనిపించడం లేదు ఏంటి.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుర్చీలో కూర్చోడం పట్ల ఎస్పీ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చెయ్యదమే కాకుండా.. ఎలా కూర్చుంటావని ప్రశ్నించారు. దీంతో ఆమె ఆగ్రహం తారస్థాయికి చేరిపోయింది. నన్ను ప్రశ్నించడానికి అసలు నువ్వు ఎవరు..? నన్ను ప్రశ్నించడానికి నీకు ఎలాంటి అధికారం లేదు..? అంటూ భూమా అఖిల ప్రియ తన మామ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

అంతేకాదు మామగా వస్తే నిన్ను మర్యాదిస్తాను.. నాకు వ్యతిరేఖంగా వస్తే కేసు పెడతాను అంటూ ఫైర్ అయ్యింది. అలానే నువ్వు నా మామగా ఫోన్ చేసావా లేదా చైర్మన్ గా ఫోన్ చేసావా అని ప్రశ్నించింది. ఆయన వెంటనే మామగా అనగా.. అయితే మామ కుర్చీలో కూర్చోవడంలో తప్పేముంది అంటూ.. ప్రశ్నలు వేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో విజయ డైరీ చైర్మన్ తో ఆమె ప్రవర్తించిన తీరుపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు..’ ఇదే తరహాలో దురుసుగా హెరిటేజ్ సంస్థ చైర్మన్ తో కూడా నువ్వు మాట్లాడగలవా..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ గౌరవప్రద స్థానంలో ఉన్న వ్యక్తితో.. అలా మాట్లాడటం సరి కాదంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

Read More