Wed Oct 16 16:01:11 UTC 2024: ## నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ బీజేపీ పై విమర్శలు

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ బీజేపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించినా, కేవలం 8 సీట్లకు పరిమితం కావడానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 సీట్లు వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హైదరాబాద్‌ పరిధిలో ఒక్కసీటు కూడా ఎందుకు గెలువలేకపోయిందని దీనిపై పార్టీ నాయకులు ఆలోచించాలని అర్వింద్‌ కోరారు. కార్పొరేటర్లకు ఓటువేసినవారే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేశారని, కాని గెలవలేకపోవడం కారణం ఏమిటని సొంత పార్టీ నాయకులపై పరోక్ష విమర్శలు చేశారు. ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని ఓటు వేసి గెలిపించుకోవాలని ఉత్సాహంగా ఉన్నారని అర్వింద్‌ అన్నారు.

ఇప్పటికై న అధికారంలోకి వచ్చేలా పార్టీ ప్రత్యేక దృష్టిసారించాలని అర్వింద్‌ కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఒక్క ఎన్నికల్లో కూడా గెలువలేదని, ఇతరులు చెప్పిన మాటలు విని నా పై విమర్శలు చేయడం తగదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ కూడా గల్లంతవుతుందన్నారు. ఇట్ల చేస్తేనే కేసీఆర్‌ను ప్రజలు ఖతం చేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ మినహా మిగితా జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే గెలుపొందారని కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్‌ ప్రజాపాలన వ్యవస్థను నాశనం చేశాడని, దానిని సరిదిద్ది మంచి పాలన అందించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేయాలన్నారు.

Read More