
Sun Sep 29 05:55:48 UTC 2024: ## రణబీర్ కపూర్ “ధూమ్ 4″లో విలన్ గా!
బాలీవుడ్ లోని అత్యంత ప్రసిద్ధ సిరీస్ లలో “ధూమ్” కూడా ఒకటి. ఈ సినిమాకు హిందీలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సిరీస్ లోని దోపిడీ సీన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం.
“ధూమ్” అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమాలోని విలన్. హీరో కంటే ఇందులో విలన్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది.
తాజాగా, ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పాన్ ఇండియా స్టార్ రణబీర్ కపూర్ “ధూమ్ 4″లో అడుగు పెట్టబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ధూమ్” బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో ఇప్పటిదాకా మూడు సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో మొదటి రెండు పార్ట్స్ సూపర్ డూపర్ హిట్స్ గా నిలవగా, మూడో భాగం మాత్రం పర్వాలేదు అనిపించింది. నాలుగో పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని “ధూమ్” ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటిదాకా “ధూమ్ 4″లో కోలీవుడ్ స్టార్ సూర్య విలన్ గా నటించబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఆ పుకార్లకు చెక్ పెడుతూ బాలీవుడ్ నుంచి క్రేజీ కాంబో ఈ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో పాటు రణబీర్ కపూర్ విలన్స్ గా నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాత ఆదిత్య చోప్రా ఈ ప్రాజెక్టుకు సంబంధించి రణబీర్ కపూర్ తో చర్చలు జరిపారని, ఆయన కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
ఒకవేళ ఈ వార్తలు నిజమైతే రణబీర్ అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. “యానిమల్” మూవీ తర్వాత ఈ హీరో చేస్తున్న మరో పవర్ ఫుల్ రోల్ ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
“ధూమ్ 4” మూవీ 2026 మొదట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది రణబీర్ కపూర్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం.