Sun Sep 29 04:55:41 UTC 2024: ## ‘ధూమ్ 4’లో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించే ఛాన్స్‌!

బాలీవుడ్‌లో యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు ‘ధూమ్‌’ ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీ నాలుగో భాగం ‘ధూమ్‌ 4’ రాబోతుందని ఇప్పటికే తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా రణ్‌బీర్‌ కపూర్‌ నటించే అవకాశం ఉందని తాజాగా తెలిసింది.

‘ధూమ్‌’ ఫ్రాంచైజీ నిర్మాత, కథా రచయిత అయిన ఆదిత్యా చోప్రా ‘ధూమ్‌ 4’ కథను ఇప్పటికే సిద్ధం చేశారని తెలుస్తోంది. ఆయన తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌ను కలిసి సినిమా గురించి మాట్లాడారని, ఈ సినిమాలో హీరోగా నటించాలనే ఆసక్తి రణ్‌బీర్‌లో ఉందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ సినిమాలో సూర్య విలన్‌గా నటిస్తారని కూడా తెలుస్తోంది. రణ్‌బీర్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు అయాన్‌ ముఖర్జీ, సిద్ధార్థ్‌ ఆనంద్‌ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం రణ్‌బీర్‌ ‘రామాయణ్‌’ చిత్రంతో బిజీగా ఉండటం, తర్వాత ‘లవ్‌ అండ్‌ వార్‌’, ‘యానిమల్‌ పార్క్‌’ సినిమాలలో నటించనుండటం వల్ల ‘ధూమ్‌ 4’ గురించిన క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టేలా ఉంది.

Read More