Mon Nov 04 22:24:24 UTC 2024: ## ఆదిలాబాద్ జట్లు రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నీలో విజేతలు
మహబూబ్‌నగర్: 43వ రాష్ట్ర స్థాయి అంతర్‌జిల్లా జూనియర్ ఖోఖో పోటీలు బుధవారం ముగిశాయి. టోర్నీలో బాలుర, బాలికల విభాగాల్లో ఆదిలాబాద్ జట్లు చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకున్నాయి.
బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా, బాలికల విభాగంలో నల్గొండ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. బాలుర విభాగం మూడవ స్థానం వరంగల్, నాలుగవ స్థానం మెదక్, బాలికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జట్లు గెలుచుకున్నాయి.
బాలుర విభాగం ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. చివరి వరకు మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు 38–36 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. బాలికల ఫైనల్ మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు 20–16 పాయింట్ల తేడాతో నల్గొండపై గెలుపొందింది.
అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజేత జట్లకు ట్రోపీలు, మెడల్స్ అందజేశారు.