Sat Nov 02 03:42:51 UTC 2024: ## ‘పైలం పిలగా’ OTTలో దూసుకుపోతోంది!

ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ప్రశంశలు అందుకున్న ‘పైలం పిలగా’ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా విశేష స్పందన పొందుతోంది. అక్టోబర్ 10 నుండి ఈటీవీ విన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, ఓటీటీలో వచ్చే సాధారణ క్రైమ్, హారర్ లేదా అడల్ట్ కంటెంట్ కి భిన్నంగా, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూసే నీట్ అండ్ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచింది. మెలోడియస్ పాటలు మరియు ఆకట్టుకునే డైలాగ్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.

‘పైలం పిలగా’ కథ పల్లెటూరి యువకుడి చుట్టూ తిరుగుతుంది. తన ఊళ్లోనే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి అంబాని లా ఎదగాలని ఆశపడతాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు, ముఖ్యంగా ప్రభుత్వ అనుమతుల విషయంలో బ్యూరోక్రసీలోని రూల్స్, అధికారుల అలసత్వం, అవినీతి వల్ల విలువైన సమయాన్ని, డబ్బును కోల్పోతాడు. చివరకు తన కుటుంబం, తన ఊరు బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.

పల్లెలు, ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ఉపాధి, వలసలు, ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వం, లంచగొండితనం వంటి లోతైన అంశాలను హాస్యభరితంగా వ్యంగంగా చిత్రీకరించింది. సెకండ్ హాఫ్ అంతా ఒక మంచి మ్యూజికల్ నరేషన్లో భావోద్వేగాలు పండడం, ఊహించని క్లైమాక్స్ తో సినిమా మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

‘పైలం పిలగా’ హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ లో, యాడ్ ఫిలిమ్ డైరెక్టర్ ఆనంద్ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం యశ్వంత్ నాగ్, కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ, శైలేష్ దరేకర్, స్టైలిస్ట్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల, సహా నిర్మాతలు రవి వాషింగ్టన్, కృష్ణ మసునూరి, విజయ్ గోపు.

Read More