
Fri Nov 01 14:00:00 UTC 2024: ## అన్‌స్టాపబుల్ సీజన్ 4: బాలకృష్ణతో అల్లు అర్జున్, పిల్లలు కలిసి అద్భుత ప్రదర్శన!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్- 4 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రెండవ ఎపిసోడ్ లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హాజరై ఆకట్టుకున్నారు. ఈ రెండు ఎపిసోడ్స్ లు ఆహా ఓటీటీలో విడుదలై రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించాయి.
మరోవైపు, పుష్ప-2 సినిమా హీరో అల్లు అర్జున్ తన ఇద్దరు పిల్లలు అల్లు అయాన్ మరియు అర్హ తో కలిసి అన్‌స్టాపబుల్ టాక్‌షోలో హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో అల్లు అయాన్ తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని చెప్పడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బాలకృష్ణ అల్లు అయాన్ ను “నీకు ఇష్టమైన ఎవరు?” అని అడగ్గా, అయాన్ ప్రభాస్ యాక్షన్ చాలా ఇష్టమని చెప్పడంతో స్టూడియోలో చప్పట్లు, విజిల్స్ మోగిపోయాయి.
అయితే ఈ ఎపిసోడ్ ఇప్పటికీ విడుదల కాలేదు. పుష్ప-2 సినిమా రిలీజ్ నాటికీ అనగా డిసెంబర్ మొదటి వారంలో ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీ లో ప్రసారం కానుంది.