
Sun Oct 27 12:40:00 UTC 2024: ## రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారం!
హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ వారం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ప్రసారం చేయనుంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతర్జాతీయ మాఫియా డాన్ బిగ్ బుల్ (సంజయ్ దత్) చుట్టూ తిరుగుతుంది. అతను గ్లియోమా నిర్ధారణ అయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి ఆరాటపడతాడు. అతని జ్ఞాపకశక్తిని మరొకరి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతను అమరుడవుతాడని ఒక శాస్త్రవేత్త సూచించడంతో అందుకు సరిపోయే వ్యక్తికోసం అన్వేషణ మొదలవుతుంది. హైదరాబాద్ లోని శంకర్ (రామ్ పోతినేని) అన్వేషణలో సరిపోయే వ్యక్తిగా గుర్తించడంతో బిగ్ బుల్ మెమరీ ట్రాన్స్ ఫర్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయం తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చూడాల్సిందే.
యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో సంజయ్ దత్, గెటప్ శ్రీను, అలీ, షాయాజీ షిండే, ఝాన్సీ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్-రామ్ పోతినేని యాక్షన్ మేళవింపుతో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.