Sun Oct 20 11:01:13 UTC 2024: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తల్లి సరోజా (83) ప్రాణాలు విడిచారు. ఆమె గత కొంతకాలం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షిణించడంతో చనిపోయారు. ఈ సంఘటనతో కిచ్చా సుదీప్ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది.

కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా సుదీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుదీప్ తల్లి ప్రోత్సాహం తన నట జీవితంపై ఎంతో ప్రభావం చూపిందని చెప్పారు.

Read More