Sun Oct 13 07:50:00 UTC 2024: ## దసరా జోష్‌తో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం దసరా పండుగ సందర్భంగా ఘనంగా జరిగింది. బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు.
19వ సారి జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఏడాది సినీ ప్రముఖులను కూడా నిర్వాహకులు అహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
అంతరించిపోతున్న తెలంగాణ కళలను భావితరాలకు అందిస్తున్న బండారు దత్తాత్రేయ, కుటుంబ, ప్రాంత, దేశ సమైక్యతకు అలయ్ బలయ్ ప్రతీక అని వారు అభిప్రాయపడ్డారు.
రాజకీయాలకు అతీతంగా గౌరవించబడే బండారు దత్తాత్రేయ 19 ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అన్ని వర్గాల వారిని ఐక్యం చేసే గొప్ప కార్యక్రమమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.