Wed Oct 09 08:15:11 UTC 2024: ## జో రూట్ టెస్టు క్రికెట్‌లో కుక్ రికార్డును బద్దలు కొట్టాడు
**ముల్తాన్:** పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అదరగొడుతున్నాడు. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న రూట్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో రూట్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులు చేసిన రూట్, ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుక్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు.
ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15921) అగ్రస్ధానంలో ఉండగా, రెండో స్ధానంలో రికీ పాంటింగ్(13378) పరుగులు చేశాడు.