Mon Oct 07 21:52:55 UTC 2024: ## రిలయన్స్ పవర్ షేర్లు గత తొమ్మిది రోజుల్లో 55 శాతం పెరిగాయి

**హైదరాబాద్:** అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ (ఆర్‌పవర్) షేర్‌ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. ఆ కంపెనీ షేర్లు గత తొమ్మిది సెషన్‌లలో 55 శాతం ర్యాలీ చేశాయి. నిధుల సమీకరణకు సంబంధించి అక్టోబర్ 3న కంపెనీ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో షేర్లకు ఊపు వచ్చింది.

విదర్భ ఇండస్ట్రీస్ పవర్‌కు రూ. 3,872 కోట్ల గ్యారెంటీని పూర్తిగా సెటిల్ చేసినట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత ఆర్‌పవర్‌ షేర్లలో అప్‌ట్రెండ్ వచ్చింది. ఈ సెటిల్‌మెంట్ ఫలితంగా రూ. 3,872.04 కోట్ల బకాయి రుణానికి సంబంధించిన అన్ని కార్పొరేట్ గ్యారెంటీలు, అండర్‌టేకింగ్‌లు, ఆబ్లిగేషన్లు పరిష్కారమయ్యాయి. సీఎఫ్‌ఎం అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌తో కూడా అన్ని వివాదాలను రిలయన్స్ పవర్ పరిష్కరించుకుంది. అంతేకాకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలన్నీ తీరిపోయినట్లు ప్రకటించింది.

2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగింపు నాటికి సంస్థ ఏకీకృత నికర విలువ రూ.11,155 కోట్లుగా ఉంది.

Read More