
Fri Oct 04 23:06:52 UTC 2024: ## టెక్నాలజీ దుర్వినియోగంపై ‘కంట్రోల్’ ట్రైలర్ హెచ్చరిక
**హైదరాబాద్:** సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిగా ఆధారపడి అనర్థాలను కొని తెచ్చుకోవడం నుంచి డీప్‌ఫేక్ వరకు డిజిటల్ స్పేస్‌లోని చీకటి ప్రపంచంపై దృష్టి సారిస్తుంది కంట్రోల్ సినిమా. నెట్‌ఫ్లిక్స్ సైబర్–థ్రిల్లర్ ‘కంట్రోల్’ ట్రైలర్ నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
‘కంట్రోల్’ అనే యాప్‌లోకి అడుగు పెడితే ఏ.ఐ అసిస్టెంట్ ప్రత్యక్షమవుతాడు. ఈ యాప్ ద్వారా యూజర్ తన జీవితం, సంతోషం ఏఐ ఆసిస్టెంట్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది. ఈ సినిమాలో అనన్య పాండే, విహాన్ సమత్ ప్రధాన పాత్రలు పోషించారు.
‘కంట్రోల్’ యాప్‌లోకి లాగిన్ అయిన నెల్లా (అనన్య పాండే) తన జీవితాన్ని నియంత్రించే హక్కును ఏఐ–జనరేటెడ్ పర్సన్ ఎలెన్‌కు ఇస్తుంది. నెల్లా తన ‘ఎక్స్’ను రిమూవ్ చేయడానికి ఏఐ అసిస్టెంట్ సహాయం కోరుతుంది. దీంతో జో సోషల్ మీడియా బ్లూప్రింట్ పిక్సెల్ బై పిక్సెల్ తుడిచిపెట్టుకు΄ోతుంది. సోషల్ మీడియాలోనే కాదు రియల్ వరల్డ్‌లోనూ అతడి ఉనికి కనిపించదు. జో ‘మిస్సింగ్’ వార్త నెల్లా చెవిలో పడుతుంది.
‘అన్‌లైన్‌లో మన ఉనికికి, నిజ జీవితంలో మనం ఎవరం అనే దానికి మధ్య గీసుకోవాల్సిన విభజన రేఖ గురించి కంట్రోల్ సిరీస్ దృష్టి పెడుతుంది’ అంటుంది అనన్య.
ఇటీవల కాలంలో అమీర్‌ఖాన్, రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్, రష్మిక మందనలాంటి టాప్ మూవీస్టార్స్ ‘డీప్‌ఫేక్’ బారిన పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘చాలా భయంగా ఉంది. సెలబ్రిటీలుగా మా ముఖాలు, గొంతులు ఎప్పుడు ఏ రకంగా బయటకు వస్తాయో తెలియకుండా ఉంది. మనం ఎంత వరకు భద్రంగా ఉన్నామో తెలియడం లేదు. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చట్టాలు తేవాలి. గట్టిగా అమలు పర్చాలి. ఇదొక్కటే పరిష్కారం’ అంటుంది అనన్య పాండే.
‘కంట్రోల్’ సినిమా సాంకేతికత దుర్వినియోగం పట్ల హెచ్చరిక గంటలా మార్మోగుతుంది.