Fri Oct 04 20:57:14 UTC 2024: ## ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు

**న్యూఢిల్లీ**: ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం (అక్టోబర్‌ 4) తన ఢిల్లీ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. లిక్కర్‌ కేసులో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2015 నుంచి సివిల్‌ లైన్స్‌ ఏరియా 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డులో ఉన్న ఇంటిలోనే కేజ్రీవాల్‌ కుటుంబం నివసించింది.

ఇక నుంచి కేజ్రీవాల్‌ కుటుంబం ఢిల్లీలోని 5, ఫిరోజ్‌షా రోడ్డులోని ఆప్‌ రాజ్యసభ ఎంపీ అశోక్‌మిట్టల్‌ ఇంట్లో నివాసం ఉండనుంది.

కేజ్రీవాల్‌ తన ఇంటిని ఎంచుకోవడం పట్ల ఎంపీ అశోక్‌మిట్టల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆప్‌ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు తమ ఇళ్లు తీసుకోవాల్సిందిగా కేజ్రీవాల్‌ను కోరినప్పటికీ ఆయన మాత్రం ఎంపీ అశోక్‌మిట్టల్‌ ఇంటినే ఎంచుకున్నారు.

Read More