Fri Oct 04 19:59:03 UTC 2024: ## ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ నివాసాన్ని ఖాళీ చేశారు

**న్యూఢిల్లీ**: ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం (అక్టోబర్‌ 4) తన సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. లిక్కర్‌ కేసులో జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

సీఎంగా పదవి చేపట్టిన 2015 నుంచి సివిల్‌ లైన్స్‌ ఏరియా 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డులో ఉన్న ఇంటిలోనే కేజ్రీవాల్‌ కుటుంబం నివసించింది. ఇక నుంచి కేజ్రీవాల్‌ కుటుంబం ఢిల్లీలోని 5, ఫిరోజ్‌షా రోడ్డులోని ఆప్‌ రాజ్యసభ ఎంపీ అశోక్‌మిట్టల్‌ ఇంట్లో నివాసం ఉండనుంది.

ఆప్‌ పార్టికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు తమ ఇళ్లు తీసుకోవాల్సినదని కేజ్రీవాల్‌ను కోరినప్పటికీ ఆయన ఎంపీ అశోక్‌మిట్టల్‌ ఇంటినే ఎంచుకున్నారు.

Read More