Tue Oct 01 05:20:34 UTC 2024: ## సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారు

చెన్నై: సినీ నటుడు, సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. సోమవారం అర్థరాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

రజినీకాంత్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉన్నట్లు కథనాలు వస్తున్నప్పటికీ, కుటుంబసభ్యులు, ఆసుపత్రి వర్గాలు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నివేదికల ప్రకారం, మంగళవారం ఆయనకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని సమాచారం. తలైవా ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు అపోలో ఆసుపత్రికి తరలి వచ్చారు.

2020లో రజనీకాంత్ తీవ్ర రక్తపోటు, అలసటతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రక్తపోటు స్థిరీకరించిన తర్వాత డిసెంబర్ 27న డిశ్చార్జ్ అయ్యి వారం రోజులు విశ్రాంతి తీసుకున్నారు.

ఇక సూపర్‌స్టార్ సినిమాల విషయానికొస్తే, ఆయన నటించిన వెట్టయాన్ ది హంటర్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించారు.

Read More