Mon Sep 30 22:06:08 UTC 2024: ## కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు
**న్యూఢిల్లీ/బెంగళూరు:** కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని లోకాయుక్త నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ చర్యకు దిగింది.
సిద్ధరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి తదితరులపై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది.
సిద్ధరామయ్యపై దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, లోకాయుక్త పోలీసుల కేసు నమోదు, తాజాగా సోమవారం ఈడీ కేసు నమోదు నేపథ్యంలో.. ప్లాట్లను తిరిగి ఇచ్చేయాలని పార్వతి నిర్ణయం తీసుకున్నారు.