Fri Nov 15 14:40:16 IST 2024: ## సూర్య ‘కంగువ’ కలెక్షన్స్ షాక్: తెలుగులో ఊహించని పతనం

సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువ’ బాక్సాఫీస్ వద్ద ఊహించని పతనం చూపిస్తూ షాక్ కలిగిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు (నవంబర్ 14) ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల నెట్, రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ఇండియాలో అత్యధికంగా తమిళ వెర్షన్ రూ.13 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగులో రూ. 6 కోట్లు, హిందీలో రూ. 3.25 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ నిపుణులు తెలిపారు.

కేరళ, కర్ణాటకల్లో మాత్రం కంగువ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. సూర్య బారీ ప్రమోషన్స్ చేసినప్పటికీ, ఆడియన్స్‌ను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

తెలుగులో రూ. 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ చిత్రం కేవలం రూ. 6 కోట్లు మాత్రమే సాధించడం సూర్య ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది.

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. నెటిజన్లు సినిమాలో ఐదు వంశాలను చూపించడం ద్వారా కన్ఫ్యూజన్‌ కలిగించిందని విమర్శిస్తున్నారు.

వారాంతం కలెక్షన్లు ‘కంగువ’ విజయానికి, నష్టానికి కీలకంగా మారనున్నాయి.

Read More