Fri Nov 08 00:40:00 UTC 2024: ## తెలంగాణలో టెట్ ఫీజు తగ్గింపు, టెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో పేపర్–1 లేదా పేపర్–2 పరీక్ష రాసేందుకు రూ. వెయ్యిగా ఉన్న ఫీజును రూ. 750కి తగ్గించింది. పేపర్–1, పేపర్–2 పరీక్షలు రాసే అభ్యర్థులకు గతంలో రూ. 2 వేలుగా ఉన్న ఫీజును రూ. వెయ్యికి తగ్గించింది.
టెట్ రాసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది. దీంతోపాటు సమగ్ర సమాచార బులెటిన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
టెట్ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరగనుంది. హాల్‌టికెట్లను డిసెంబర్ 27 నుంచి 2025 జనవరి 20 మధ్య డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇది ఈ నెల 20వ వరకు కొనసాగుతుంది. టెట్ అర్హత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయ నియామకంలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.