Thu Oct 31 10:34:28 UTC 2024: ## తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ పదవిలో తనను నియమించినందుకు ఎన్డీయే పెద్దలకు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు.

టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే అయి ఉండాలని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తిరుమలలో ఎన్నో అరాచకాలు చేసిందని విమర్శించారు. అందుకే గత ఐదేళ్లలో తిరుమల వెళ్లలేదని వివరించారు. కొండపై పవిత్రత లేకపోయేసరికి బాధపడ్డానని వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు.

టీటీడీ పాలకమండలి నియామకం పూర్తయింది. కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. బీఆర్ నాయుడు సహా మొత్తం 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు కానుంది.

**టీటీడీ పాలకమండలి సభ్యులు:**

* జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
* ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)
* ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
* పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)
* సాంబశివరావు (జాస్తి శివ)
* శ్రీసదాశివరావు నన్నపనేని
* మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
* జంగా కృష్ణమూర్తి
* దర్శన్‌. ఆర్‌.ఎన్‌
* జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
* జానకీ దేవి తమ్మిశెట్టి
* బూంగునూరు మహేందర్‌ రెడ్డి
* అనుగోలు రంగశ్రీ
* బురగపు ఆనందసాయి
* డా. అదిత్‌ దేశాయ్‌
* శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా

Read More