Wed Oct 30 16:00:00 UTC 2024: ## మంత్రి కొండా సురేఖ దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. “మనిషిలో అజ్ఞానాంధకారాలు తొలగినప్పుడే జ్ఞాన జ్యోతులు ప్రకాశిస్తాయి” అని ఆమె అన్నారు. దీపావళి భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ అని ఆమె వివరించారు. చీకటిని వెలుగు పారద్రోలినట్టే ఎన్నటికైనా అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుందని దీపావళి పండుగ తెలియజేస్తుందని చెప్పారు.

దీపావళి రోజున వెలిగించే దీపాలు మనిషిలో జ్ఞాన చైతన్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. వెలుగులు పంచే దీపావళి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాణసంచా కాల్చే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను, సకల శుభాలను తీసుకురావాలని ప్రార్థించారు.

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిష్టతో అడుగులు వేస్తోందని మంత్రి కొండా స్పష్టం చేశారు.

Read More