Wed Oct 30 06:58:32 UTC 2024: ## ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి
ముంబయి: ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్లు స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. ఒక్క రోజులోనే షేర్ ధర రూ.3.5 నుంచి ఏకంగా రూ.2,36,250కు పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.4,725 కోట్లకు చేరింది.
దేశంలో ఇప్పటి వరకు అత్యధిక విలువ కలిగిన ఎంఆర్‌ఎఫ్ షేర్లను ఎల్సిడ్ అధిగమించింది. గతేడాది నుంచి ఎల్సిడ్ షేర్లు రూ.3.21 వద్ద నిలిచిపోయి ఉన్నాయి. మంగళవారం రీలిస్టింగ్ అయ్యింది. సెబీ ఆదేశాల మేరకు నిర్వహించిన స్పెషల్ కాల్ యాక్షన్‌లో ఒక్క పూటలోనే 73,600 రెట్లు పెరిగింది.
ఏసియన్ పెయింట్స్‌లో ఎల్సిడ్‌కు 2.95 శాతానికి సమానమైన రూ.8,500 కోట్ల విలువ చేసే 2 లక్షల పైగా షేర్లను కలిగి ఉంది. రూ. 2,25,000 వద్ద షేరు ధర ప్రారంభమైనప్పటకీ వెంటనే 5 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకి రూ. 2,36,250 వద్ద ముగిసింది. ఒక్క రోజులో కేవలం 278 షేర్లు మాత్రమే ట్రేడింగ్ అయ్యాయి.