Sun Oct 27 04:00:04 UTC 2024: ## మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ పాయిజన్‌తో ఒకరు మృతి, డజన్ల కొద్దీ అస్వస్థత

**హైదరాబాద్‌:** అమెరికాలో మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ పాయిజన్‌తో ఒకరు మరణించగా, డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారు.

సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభమైన ఈ వ్యాప్తి 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

ఈ.కోలి బ్యాక్టీరియా సోకి, మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లో తిన్న ఒకరు మరణించారని సీడీసీ తెలిపింది. 10 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.

అనారోగ్యం బారిన పడటానికి ముందు వీరు మెక్‌డొనాల్డ్స్‌లో ఆహారం తీసుకున్నట్లు సీడీసీ పేర్కొంది.

వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్‌‌ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి.

సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్‌డొనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి.

మెక్‌డొనాల్డ్స్ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో విడుదల చేస్తూ, “నాకు, మెక్‌డొనాల్డ్స్‌లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్‌లెట్‌లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు.

ఈ.కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది.

Read More