Fri Oct 11 13:02:09 UTC 2024: ## తెలంగాణ ప్రభుత్వం మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కేటాయించింది

హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ పోస్టు కేటాయించింది. ఈ మేర‌కు రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. సిరాజ్‌కు గతంలోనే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు.

టీ 20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం సిరాజ్‌ను ఘనంగా సన్మానించి క్రికెట్‌‌లో భారత్‌కి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడంటూ అభినందించారు.

సిరాజ్‌తో పాటు తెలంగాణ స్టార్ ప్లేయర్స్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్‌లకు కూడా ప్రభుత్వం ఇంటి స్థలం, గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. ఇటీవల బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ(స్పెషల్ పోలీస్‌) గా నియామక పత్రాలు అందుకుంది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ 2024 క్రీడల కార్యక్రమంలో యూనిఫామ్ ధరించి వచ్చిన నిఖత్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాఠీని అందుకున్నారు.

Read More