Mon Oct 07 10:52:21 UTC 2024: ## ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు సిద్ధం

కరాచీ: బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు బుధవారం కరాచీకి చేరుకుంటుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. ఈ నెల 7 నుంచి ముల్తాన్‌లో జరిగే తొలి టెస్టుతో సిరీస్ మొదలవుతుంది. రెండో టెస్టు కూడా ముల్తాన్‌లోనే జరుగుతుంది. 15 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ తర్వాత రావల్పిండిలో 24 నుంచి 28 వరకు జరిగే ఆఖరి టెస్టుతో ఇంగ్లండ్ పర్యటన ముగుస్తుంది. ఈ సిరీస్‌లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లేమీ నిర్వహించడం లేదు.

ఇటీవల పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై తొలిసారి బంగ్లాదేశ్‌ చేతిలో భంగపడటంతో కెప్టెన్‌ షాన్‌ మసూద్‌పై విమర్శల వాడి ఇంకా తగ్గడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలోనూ అందరి లక్ష్యం అతనే అయ్యాడు. కెప్టెన్సీ వదులుకోవచ్చుగా అని పరుష పదజాలంతో జర్నలిస్టులు ప్రశ్నించారు.

పీసీబీ మీడియా డైరెక్టర్‌ పాక్‌ జాతీయ జట్టు కెపె్టన్‌ను గౌరవించాలని సదరు జర్నలిస్టుకు సూచించారు. ఇటీవల పీసీబీ నిర్ణయాలపై కూడా పలువురు మండిపడుతున్నారు. కనీస జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.

Read More