Fri Oct 04 15:35:48 UTC 2024: ## “శ్వాగ్”: క్లిష్టమైన కథతో శ్రీవిష్ణు కొత్త సినిమా థియేటర్లలో విడుదల

హీరో శ్రీవిష్ణు నటించిన “శ్వాగ్” చిత్రం నేడు(అక్టోబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘రాజ రాజ చోర’ హిట్ తర్వాత శ్రీవిష్ణువుతో డైరెక్టర్‌ హసిత్‌ గోలి తెరకెక్కించిన రెండో చిత్రమిది.

సినిమా కథ 1550ల నాటి మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య పోరు నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి ఎస్సై భవనభూతి (శ్రీవిష్ణు) భార్య రేవతి (మీరా జాస్మిన్‌) ఎందుకు అతన్ని వదిలి వెళ్లిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు.

ఫస్టాఫ్‌లోనే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి.. ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్‌ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్‌గా చర్చించారు. ముఖ్యంగా విభూతి (శ్రీవిష్ణువు) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా.. చివరకు ఎమోషనల్‌గా ముగుస్తుంది.

శ్రీవిష్ణు నటన అద్భుతం. విభిన్నమైన ఐదు పాత్రల్లో నటిస్తూ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. రీతూ వర్మ రెండు పాత్రల్లో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్‌ తెరపై కనిపించేంది కాసేపే అయితే..ఉన్నంతలో బాగానే చేసింది. సునీల్‌, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్‌ సాగర్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.

Read More