Mon Sep 30 17:20:08 UTC 2024: ## పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నెతన్యాహును ఉగ్రవాదిగా అభివర్ణించారు

జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె నెతన్యాహును అడాల్ఫ్ హిట్లర్ తర్వాత అతి పెద్ద ఉగ్రవాదిగా అభివర్ణించారు.

“ప్రజలను చంపడానికి హిట్లర్ గ్యాస్ చాంబర్‌లను ఏర్పాటు చేయగా, నెతన్యాహు పాలస్తీనా మరియు లెబనాన్‌లను గ్యాస్ చాంబర్లుగా మార్చేశాడు,” అని ముఫ్తీ ఆరోపించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఇజ్రెయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు.

ముఫ్తీ పాలస్తీనాలో వేల మందిని చంపిన నెతన్యాహు ఇప్పుడు లెబనాన్‌లో అదే తరహా పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మహత్మా గాంధీ కాలం నుంచి పాలస్తీనాకు తాము అండగా ఉన్నామని ముఫ్తీ గుర్తు చేశారు.

హత్యకు గురైన హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను అమరవీరుడుగా అభివర్ణిస్తూ ముఫ్తీ ట్వీట్ చేయగా దానిపై భారతీయ జనతాపార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై కూడా ముఫ్తీ రియాక్ట్ అయ్యారు. పాలస్తీనా ప్రజల కోసం నస్రల్లా చేసిన సుదీర్ఘ పోరాటం గురించి బీజేపీకి తెలియదని ఆమె ఎద్దేవా చేశారు.

Read More