Sun Sep 29 17:11:20 UTC 2024: ## తమిళనాడులో కేబినెట్ విస్తరణ : డిప్యూటీ సీఎంగా ఉదయనిది స్టాలిన్ ప్రమాణం
**చెన్నై :** తమిళనాడులో కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ కొత్తగా ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఉదయనిది స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, పలువురి మంత్రుల శాఖల్ని మార్చారు సీఎం స్టాలిన్.
ఈడీ దర్యాప్తు చేసిన అవినీతి కేసులో అరెస్టయి బెయిల్‌పై ఉన్న సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రిపదవి దక్కింది.